ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1. ఆస్కార్ వేడుకలో దర్శకుడు రాజమౌళి... గవర్నర్స్ అవార్డ్స్ అంటే ఏంటి... ఎందుకిస్తారు
'ఆర్‌ఆర్ఆర్' సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందా? జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ అవార్డ్ వస్తుందా? కొద్ది రోజుల కిందటి వరకు 'ఆర్‌ఆర్ఆర్' సినిమా మీద సోషల్ మీడియాలో నడిచిన చర్చ ఇది. ఆస్కార్ నామినేషన్లకు భారత ప్రభుత్వం 'ఆర్ఆర్ఆర్'ను పంపించకపోవడంతో అభిమానుల ఆశ కలగానే మిగిలి పోయింది.
అయితే ఇప్పుడు వారి కలలో కొంత సాకారమైంది. ఒక 'ఆస్కార్' కార్యక్రమంలో తాజాగా రాజమౌళి మెరిశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
2. జ్ఞానవాపి కేసు: 'శివలింగం' వయసును ఎలా నిర్ధారిస్తారు? కార్బన్ డేటింగ్ అంటే ఏంటి?
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో 'శివలింగం'గా భావిస్తున్న నిర్మాణం వయసును తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆ నిర్మాణం 'శివలింగమే' అని కొందరు హిందువులు వాదిస్తుంటే కాదు అది 'ఫౌంటైన్ హెడ్' అని జ్ఞానవాపి మసీదును నడిపే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఆ కట్టడం వయసును నిర్ధారించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే 'శివలింగం'గా భావిస్తున్న ఆ కట్టడం జీవం లేనిది కాబట్టి, కార్బన్ డేటింగ్ ద్వారా దాని వయసును నిర్ధారించడం సాధ్యం కాదని భారత పురాతత్వశాఖ కోర్టుకు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, NATIONAL EMBRYO DONATION CENTER
3. ఐవీఎఫ్: 30 ఏళ్ల కిందట దాచిన పిండాలతో కవల పిల్లల జననం
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్ 31న కవల పిల్లలు పుట్టారు. అయితే.. 30 ఏళ్ల కిందట శీతలీకరించి భద్రం చేసిన పిండాల నుంచి ఈ కవలలు పుట్టటం విశేషం.
పిండాలను ఫ్రోజ్ చేసిన అత్యంత సుదీర్ఘ కాలం తర్వాత విజయవంతంగా సజీవంగా పిల్లలు పుట్టిన రికార్డు ఇదేనని భావిస్తున్నారు.
ఆ పిండాలను 1992 ఏప్రిల్ 22వ తేదీన మైనస్ (-) 128 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో శీతలీకరించి దాచారు. ఓరెగావ్‌కు చెందిన నలుగురు పిల్లల తల్లి రాచెల్ రిడ్జ్‌వే.. ఆ పిండాలను తన గర్భంలో మోసిన 2022 అక్టోబర్ 31వ తేదీన కవల పిల్లలకు జన్మనిచ్చారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, BBC NEWS
4. రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
చరిత్రలో కల్పిత పాత్రగా చెప్పుకున్న మూడో శతాబ్దపు ఒక రోమన్ చక్రవర్తి నిజానికి ఉండేవారని ఒక పురాతన బంగారు నాణేం వల్ల రుజువు అయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ట్రాన్సిల్వేనియాలో 300 ఏళ్ల క్రితం స్పాన్సియాన్ అనే పేరుతో పాటు వ్యక్తి ముఖచిత్రం ఉన్న నాణేం లభ్యమైంది. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యానికి ఈ ప్రాంతం సైనిక స్థావరంగా ఉండేది.
ఆ నాణేన్ని నకిలీదని భావించి దాన్ని మ్యూజియంలోని అల్మారాలో ఉంచారు.
ఈ నాణేం 2000 ఏళ్ల క్రితం చెలామణిలో ఉండేదని నాణేన్ని మైక్రోస్కోపులో చూస్తే కనిపించే గీతలు రుజువు చేస్తున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి

5. ఆంధ్రప్రదేశ్‌లో వందేళ్ళ తర్వాత భూముల రీసర్వే ఎందుకు చేస్తున్నారు?
భూ రికార్డుల విషయంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భూముల రీ సర్వే, రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేస్తామని సర్కారు అంటోంది.
'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. తొలివిడత 2వేల గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల జరిగే మార్పులేంటి, సర్వే నిర్వహించిన చోట ఏం జరుగుతోంది, కొత్త విధానం ద్వారా కలిగే ప్రయోజాలేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








