Screwworm: శరీరంలో చేరి మాంసం తినే ఈ పరాన్నజీవి ఏమిటి? మనుషులకు ఎంత ప్రమాదకరం?
మాంసం తినే స్క్రూవర్మ్ అనే పరాన్నజీవి అమెరికాలో తొలిసారిగా మానవ శరీరంలో బయటపడింది.
న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ (ఎన్‌డబ్ల్యూఎస్) మైయాసిస్‌ను ఎల్ సాల్వడార్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక రోగి శరీరంలో కనుగొన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్) ఆగస్టు 25న వెల్లడించింది.
ఈ కేసు ఆగస్ట్ 4న నిర్ధరణ అయింది.
ఈ రోగం ప్రధానంగా పశువులకు వ్యాపిస్తుంది. కానీ అమెరికాలో తొలిసారిగా మానవ శరీరంలో ఈ పరాన్నజీవులు కనిపించాయి.
మాంసాహార పరాన్నజీవి న్యూవరల్డ్ స్క్రూవర్మ్ (ఎన్‌డబ్ల్యూఎస్) కేసులు మెక్సికోలో పెరుగుతున్నాయి.
మెక్సికో ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జులై మూడో వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు నాలుగు వారాల మధ్య కాలంలో ఎన్‌డబ్ల్యూఎస్ బారినపడిన జంతువుల సంఖ్య 53 శాతం పెరిగింది.
దీని లక్షణాలేమిటి? మనుషులకు ఇది ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









